27.3 C
Hyderabad

 లింగంపేట సొసైటీ చైర్మన్ గా బుర్ర నారా గౌడ్

Burra Nara Goud as Lingampet Society Chairman

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట, బతుకమ్మ :

 

లింగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా బుర్ర నారా గౌడ్ ను నియమించినట్లు సొసైటీ సీఈఓ పెంటయ్య మంగళవారం తెలిపారు. లింగంపేట సొసైటీ నూతన పాలక వర్గ సభ్యులను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నూతన చైర్మన్ గా బుర్ర నారాగౌడ్, పాలకవర్గ సభ్యులుగా ఆకుల లక్ష్మీనారాయణ, ముదాం లక్ష్మీనారాయణ, మాల కమ్మరి యాదమ్మ, కమ్మరి సిద్ధిరాములు, కొత్త పోచయ్య, ముక్కర ఇందిర, కొడబోయిన సాయి కుమార్, గాజుల ఎదుల్, అట్టెం మల్లయ్య, వడ్ల విఠల్, కేతావత్ పూల్య, నక్క పర్వయ్య లను నియమిస్తూ సహకార శాఖ ఉన్నత ఆధికారులు ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ పాలక వర్గ సభ్యులు సొసైటీ ఎన్నికలు జరిగే వరకు పదవిలో కొనసాగుతారని ఆయన చెప్పారు. లింగంపేట సొసైటీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు  ఎమ్మెల్యే మదన్ మోహన్రావుకు బుర్ర నారా గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article