25.9 C
Hyderabad

కేసరి యాడ్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్

MLA Dhanpal launches 'Kesari' advertising agency

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

.నిజామాబాద్ నగరంలోని కేసీఆర్ కాలనీలో కేసరి యాడ్ సంస్థను ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, నగర మేయర్ ఉమారాణి లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ నగరం వ్యాపార రంగం లో దూసుకుపోతుందని, పట్టణలకే పరిమితమైన వ్యాపార ప్రకటనలు సరికొత్త ఆలోచనతో ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కేసరి యాడ్ సంస్థను నెలకొల్పారని వారన్నారు. మహా నగరాలకు పరిమితమైన ఇలాంటి సంస్థలు జిల్లాలో నెలకొల్పడం సంతోషకరమన్నారు. వ్యాపారంగం లో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కార్పొరేటర్ ,బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు బొబ్బిలి వేణు,నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

MLA Dhanpal launches 'Kesari' advertising agency
 

More articles

Latest article