24.3 C
Hyderabad

కట్లపాము కరిచిన బాలుడిని రక్షించిన జీజీహెచ్ వైద్యులు

GGH doctors save boy bitten by a common krait

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ :

 

కట్లపాము కాటుకు గురై తీవ్ర నరాల సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న 9 ఏళ్ళ బాలుడికి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జీజీహెచ్ లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాములు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  డా.రాములు కథనం ప్రకారం ఈ నెల 5న కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అజాన్ అనే 9 ఏళ్ళ బాలుడిని కట్లపాము కాటు వేసింది. ముందుగా బాలుడిని బాన్సువాడ  ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం 6న జీజీహెచ్ కు రిఫర్ చేశారు. నిజామాబాద్ జీజీహెచ్ లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్  కేర్ యూనిట్ లో బాలుడికి తీవ్ర నరాల సంబంధించిన ప్టోసిస్, మాటలు స్పష్టంగా రాకపోవడం లాంటి సమస్యలతో పాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తక్షణమే స్సందించిన పిల్లల వైద్య నిపుణులు 20 వైల్స్ యాంటి స్నేక్ వెనం అందించడంతో పాటు ఆట్రోపిన్, నియోస్టిగ్మిన్ చికిత్సను అందించారు. శ్వాస సంబంధిత సమస్య ఎక్కువగా కావడంతో వెంటి లెటర్ పై నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత ఫలితం కనిపించడంతో బాలుడికి వెంటి లెటర్ తొలగించారు. ప్ర్రస్తుతం బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆజాన్ కు అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడడంలో పిడియాట్రిక్ ప్రొఫెసర్లు శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఫ్రొపెసర్లు కీర్తి, వారి టీం చేసిన పని పట్ల ప్రశంసించారు. జీజీహెచ్ లో అత్యవసర వైద్య సేవల్లో ప్రైవేట్ కు ఏ మాత్రం తీసిపోకుండా సేవలందిస్తున్నామని డా.రాములు తెలిపారు.

More articles

Latest article