మున్సిపల్ సానిటేషన్ సిబ్బందికి రేడియం జాకెట్ల పంపిణీ
బతుకమ్మ, భీమ్ గల్ : స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సానిటేషన్ వర్కర్స్ కు రేడియం జాకెట్లను మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ శనివారం పంపిణీ చేశారు. చైర్మన్ కౌన్సిలర్ తో కలిసి సానిటేషన్ సిబ్బందికి రెయిన్ కోట్లు, గ్లౌసులు,బూట్లను అందజేశారు. అనంతరం సిబ్బందికి డాక్టర్. అజయ్ పవర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించాలని అన్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు....