. . . రైల్వే డబుల్ ట్రాక్ పనుల కారణంగా అవుట్ ఆర్ యూబి బంద్
. . . వాహనాల దారి మళ్లింపునకు అదేశాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగర లోని కంటేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జీ దక్షిణ మధ్య రైల్వే డబుల్ ట్రాక్ వర్క్ చేపట్టడం మొదలు పెడుతున్నందున ఈనెల 16 నుంచి సుమారుగా (45) రోజుల వరకు వాహనాలు బయటకు వెళ్లడానికి ఉన్న ఆర్ యూబి వన్ సైడ్ మూసి వేస్తున్నట్టు పోలిస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. ఎన్టీఆర్ చౌరస్తా వైపు నుంచి జెడ్పి చౌరస్తా, కంటేశ్వర్ బైపాస్ వెళ్లే దారిలో ఒకవైపు గల రైల్వే అండర్పాస్ విస్తారణ పనులను కావున వాహనదారులు నిజామాబాద్ నగరం లోపలికి వచ్చే వాహనాలు ఆర్మూర్, నిర్మల్, అదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్ వచ్చే వాహనాలు నేరుగా పాత దారి వెంబటే అనగా, కంఠేశ్వర్ బైపాస్, మీసేవ కంటేశ్వర్, ఒకవైపు పని పూర్తి అయిన రైల్వే అండర్ పాస్ గుండా ప్రయాణిస్తూ ఎన్టీఆర్ చౌరస్తా చేరుకొని అక్కడి నుండి కుడి చేతి వైపు తిరిగి రైల్వే స్టేషన్ ముందర నుంచి బస్టాండ్ చేరుకోవాలి అని తెలిపారు. నిజామాబాద్ నగరం నుంచి ఆర్మూర్, కరీంనగర్, అదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దేవీ రోడ్డు రైల్వే ఫ్లై ఓవర్ ని ఉపయోగించి దుబ్బ శివాజీ స్టాచ్యూ, దుబ్బ రోడ్ లో ప్రయాణిస్తూ దుబ్బా చౌరస్తా ( శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ) వద్ద ఎడమ చేతి వైపు మలిపి ఖానాపూర్ చౌరస్తా చేరుకోవాలన్నారు. అలాగే మహాలక్ష్మి టెంపుల్ దుబ్బ చౌరస్తా నుండి నేరుగా కూడా జిజి కాలేజ్ వద్ధ యు టర్న్ దాకా వెళ్లి బైపాస్ నుండి కంటేశ్వర్ చౌరస్తా చేరుకోవాలన్నారు. హైదరాబాద్, కామారెడ్డి వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా నుంచి మాధవ నగర్ రైల్వే గేట్ దాటుతూ మాధవ నగర్ బైపాస్ నుండి హైదరాబాద్ రోడ్డు చేరుకోవాలన్నారు. బోధన్, బాన్సువాడ, వర్ని వెళ్లే వాహనాలు యధావిధిగా పాత మార్గమునే అనుసరించి ప్రయాణం సాగించాలి. కావున నిజామాబాద్ నగర ప్రజలకు ఈ రైల్వే అండర్పాస్ పని సుమారుగా (45) రోజులు జరిగే అవకాశం ఉన్నందున పై తెలిపిన దారులను ఉపయోగించుకొని పట్టణంలోనికి రావడం, నగరం నుంచి బయటకు పోవడం కొనసాగించాలని సీపీ సూచించారు.

