25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

గణేష్ మండపాల ఏర్పాటుకు పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • శాంతి భద్రతలు, బందోబస్తుకై ఆన్ లైన్ లో నమోదు
  • కామారెడ్డి పట్టణ ఇన్స్ స్పెక్టర్ నరహరి

 

 కామారెడ్డి, బతుకమ్మ : ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆన్ లైన్ ఇన్ ఫర్మేషన్ కోసం పోర్టల్ ను తయారు చేసిందని అందులోనే గణేష్ మండళ్ళ నిర్వాహకులు పూర్తి సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలని కామారెడ్డి పట్టణ సిఐ నరహరి తెలిపారు. పోలీసు శాఖ  రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపంనకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించిందని ఈ యొక్క సమాచారం ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని అన్నారు. ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుము లేదని సి.ఐ , గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో  ఏర్పాటు చేయుటకు ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని  అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్  నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు.  భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్ లైన్ నమోదు విధానం, గణేష్ మండప నిర్వాహకులు పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని పోలీసు వారికి సహకరించాలన్నారు. గణేష్ మండపాలను ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ శాఖ వారి అనుమతితోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు.ప్రతి మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లు మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. మండపంలో 24 గంటలు పాటు నలుగురు వాలంటరీ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకొని భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటరీలను నియమించాలన్నారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

More articles

Latest article