- బిఎస్పి జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్
మద్నూర్, బతుకమ్మ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఎస్పీ సత్తా చాటాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ పేర్కొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీని ఉద్దేశించి దిశ నిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో బిఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి సత్తా చాటాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గం 2023వ సంవత్సరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్ కుమార్ బిఎస్పి పార్టీ కట్టుబాట్లను, పార్టీ విధానాన్ని ఆకర్షితుడై బిఎస్పి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ సమక్షంలో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఏకగ్రీవంగా ప్రేమ్ కుమార్ కు బిచ్కుంద మండల బిఎస్పి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షుడు రోహిదాస్, ఇంచార్జ్ జైపాల్ తదితరులు ఉన్నారు.
