. . . జై దుర్గా మాత సేవలాల్ మందిరంలో ప్రత్యేక పూజలు
. . . ఆలయ కమిటీ చైర్మన్ బాధావత్ కిషన్
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని తాండ గ్రామంలో సోమవారం జై దుర్గా మాత సేవలాల్ మందిరంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పౌర్ణమి ముందర ఆలయంలో బ్రాహ్మణుల మంత్రోత్సాహాలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని జై దుర్గా మాత సేవలాల్ ఆలయ కమిటీ చైర్మన్ బాధావత్ కిషన్ తెలిపారు. ఈ పూజలలో జంటల వారీగా ఇందల్వాయి తాండవా గ్రామ వాసులు యజ్ఞాలలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. పూజలో హాజరైన భక్తులు జై దుర్గా మాత జై సేవాలాల్ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆలయ నిర్మాణం 2010లో నిర్మించడం జరిగిందని ఇప్పటివరకు దాదాపు నేటితో 16 సంవత్సరాలు గడుస్తున్నందున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు భోజనాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాధావత్ కిషన్, ఇందల్వాయి తాండ గ్రామ సర్పంచ్ బాదావత్ సుదర్శన్ నాయక్, ఉప సర్పంచ్ బాలు, మాజీ సర్పంచ్ చందర్ నాయక్, తాండ సదర్ నాయక్ గన్యా నాయక్, ఆలయ పూజారి బాల్య నాయక్, మాజీ డైరెక్టర్ చందర్, నారాయణ, బలిరాం, శంకర్, యువకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
