24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎనిమిదవ రోజు కొనసాగిన నిరసన

Must read

📰 Generate e-Paper Clip

 

మెండోరా, బతుకమ్మ :

 

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కోల్, యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాని నిరసిస్తూ పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగుల నిరసన 8 వ రోజుకు చేరుకుంది. టి జి పి ఈజేఏసీ నాయకులు కే సతీష్, ఎండి రఫీ, దేవరాజ్, ఎం ప్రవీణ్, చంద్రశేఖర్, రాంబాబు, స్వాతి, దేవి, ఏవి శ్రీనివాస్ తదితరుల నాయకత్వంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్ కో ఉద్యోగులకు మద్దతుగా ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. యజమాన్యం టెండర్ ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జలవిద్యుత్ కేంద్ర ఉద్యోగులు టిజీపి ఈ జే ఏసి నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article