27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆగిన పనులు పూర్తి చేసి అభివృద్ధికి నిధులివ్వండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఇంచార్జీ మంత్రికి మాజీ మంత్రి విన్నపం

 

భీమ్ గల్, బతుకమ్మ :  బాల్కొండ నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులిచ్చి పూర్తి చేయాలని, కొత్త అభివృద్ధి పనులకు నిధులనిచ్చి అభివృద్ధికి సహకరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కు వినతిని అందజేశారు. బుధవారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రితో కలిసి చెక్కులు పంపిణి చేసిన అనంతరం వినతి అందజేశారు. భీమ్ గల్ పట్టణ కేంద్రంలోఆగిపోయిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, వంద పడకల ఆసుపత్రితో పాటు,కాళేశ్వరం 21ఏ ప్యాకేజ్ పనులు, చిత్తపూర్, సూరిబిర్యాల,ఫాత్తేపూర్ లిఫ్ట్ పనులకు నిధులను ఇచ్చిన పూర్తి చేయాలని మంత్రిని కోరారు. వాటితో పాటుగా లింబాద్రి గుట్ట అభివృద్ధికి టూరిజం డెవల్ప్ మెంట్ కింద రూ. 25 కోట్లు మంజూరు చెయ్యాలని, ఎస్సారెస్పీ బ్యాక్ షోర్ ను పర్యాటక కేంద్రంగా తగినన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.

More articles

Latest article