రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మందర్న గ్రామానికి చెందిన బుచ్చల్ వార్ గంగాధర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం ఆ వ్యక్తిని బోధన్ కోర్టులో హాజరపరచగా బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ఆ వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తీర్పు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఎస్సై సాయన్న పేర్కొన్నారు.
