30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కిలో అల్పాజోలం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

  • నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో నిషేదిత మత్తు పదార్థమైన అల్పాజోలం రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ట్రైనీ ఐపీఎస్ , ఇంచార్జి రూరల్ ఎస్ హెచ్ వో సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంచార్జి ఎస్ హెచ్ వో మాట్లాడుతూ నిర్మల్ జిల్లాకు చెందిన గంధం శ్రీనివాస్ గతంలో అల్పాజోలం తీసుకువచ్చి నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో సప్లయ్ చేసి అమ్మినట్లు గుర్తించామన్నారు. ఈ నెల 15న అర్ధరాత్రి ప్రాంతంలో తన కారులో అరకిలో అల్పాజోలంతో గిరిరాజ్ కళాశాల రోడ్డులో ఉండగా విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్నట్లు తెలిపారు. 2 లక్షల విలువైన నిషేదిత మత్తు పదార్థాన్ని రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసుకువచ్చి స్థానికంగా అమ్మకాలు చేస్తున్నాడని తెలిపారు. అప్పుడే మహబూబ్ నగర్ కు చెందిన బొట్లకుంట్ల కాటమయ్య గౌడ్, మలే అనిల్ గౌడ్, ఏడిగే శ్రీనివాస్ లకు అర కిలో అమ్మినట్లు అంగీకరించడంతో వారిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కిలో అల్పాజోలంతో పాటు , మూడున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురి వద్ద నుంచి రెండు కార్లు, ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నలుగురిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

More articles

Latest article