బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు 15వ వార్డు కాలనీవాసులకు శాపంగా మారాయి. వివరాల్లో కి వెళ్ళినట్లయితే 15వ వార్డు బస్టాండ్ సమీపంలో గల ప్రధాన కాలనీలో గత 20 సంవత్సరాల క్రితం పాత డ్రైనేజీ నిర్మాణం ఉండగా వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలనీలోని మురికి నీళ్లు రోడ్డుపై ప్రవహిస్తూ తమ ఇళ్లల్లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్య సంబంధిత అధికారులకు తెలిపిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు మా యొక్క కాలనీ సమస్యను మరింత పెద్దగా చేయడానికి నూతన సెంట్రల్ లైటింగ్ కు ఇరువైపుల నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువలు చిన్న కాలువలలో కలపడం వల్ల తీవ్ర ఇబ్బందులకు కాలనీవాసులు గురవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువను పెద్ద కాలువలలో నీటిని మళ్ళించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కాలనీవాసులు పాల్గొన్నారు.