29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జీపి కార్మికుల ముందస్తు అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బందిని పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు వెళుతున్న సిబ్బందిని ఉదయం ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా నిర్వహించే ఈ ధర్నాను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని అరెస్టులు చేయించడం బాధాకరమని పంచాయతీ సిబ్బంది వాపోయారు. అరెస్టు అయిన వారిలో వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.

More articles

Latest article