పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్

0 1,292

బతుకమ్మ: బిచ్కుంద :  గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం చలో హైదరాబాద్ తరలి వెళ్తున్న బిచ్కుంద గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయకుండా ముందస్తు అరెస్టు చేయడం శోచనీయం అని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం18 వేల రూపాయలు ఇవ్వాలని,పెండింగ్లో ఉన్నవేతనాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతో పాటుఆరోగ్య హెల్త్ కార్డులుఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్మికులకుముందస్తుఅరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఇప్పటికైనా కార్మికుల పట్ల సానుభూతితో వీరి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మాణిక్, లక్ష్మయ్య.,భూమయ్య, మారుతి, బిచ్కుంద గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.