- సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
- సిసిఐ కొనుగోలు కేంద్రం ఎవరికోసం ? ఆదివారం ప్రచురితమైన శీర్షికకు అధికారులు స్పందించారు.
- రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి
- జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొపిశెట్టి
బతుకమ్మ, మద్నూర్: సీసీఐ కొనుగోలు కేంద్రం ఎవరికోసం? అనే శీర్శికన బతుకమ్మ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యాడ్ లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం అధికారులు ప్రారంభించారు. పత్తి రైతులు దళారుల, వ్యాపారవేత్త చేతులో మోసపోవద్దు. సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి సీసీఐ అధికారులకు, మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. పత్తి పంటకు మద్దతు ధర క్వింటాల్ కు రూ.7521 చొప్పున కొనుగోలు చేయాలని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పత్తి పంట తేమ 8 శాతం నుండి 12 శాతం వరకు ఉండాలని అధికారులు సూచించారు. ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున మద్దతు ధర కేంద్రంలో రైతులు అమ్ముకోవచ్చని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధర కొనుగోళ్ల అమ్మకానికి తీసుకువచ్చిన పత్తి రైతు పంట తేమశాతం అనుకూలంగా ఉండడంతో ఆ రైతుకు జిల్లా అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, మార్కెట్ కమిటీ అధికారులు ప్రత్యేకంగా సన్మానించారు. పత్తి కొనుగోళ్ళను మార్కెట్ కమిటీ పరిధిలోని ప్రైవేట్ గోవిందు ఇండస్ట్రీలో చేపట్టారు. పత్తి పంట రైతులు అమ్మటానికి తీసుకువచ్చిన వారికి నిబంధనల ప్రకారం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, సీసీఐ అధికారులు రాష్ట్ర సరిహద్దును సందర్శించి కొనుగోలు పత్తి మిల్లును సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సూపర్వైజర్లు రాంచందర్, సత్యం, మార్కెట్ సిబ్బంది, సిసిఐ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

