26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జరిమానా విధిస్తారని భయంతో ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

మోపాల్, బతుకమ్మ : చేపల చెరువులో దొంగతనానికి యత్నించిన వ్యక్తి కాపలదారులు గుర్తించి సొసైటీ సభ్యులకు చెప్పడంతో ఎక్కడ కులంలో జరిమానా విధిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారనని భయపడిన వ్యక్తి బలవర్మణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లిలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ముదక్ పల్లి గ్రామానికి చెందిన పాల చిన్నయ్య అనే వ్యక్తి మంగళవారం రాత్రి కులాస్ పూర్ చెరువులో దొంగతనంగా చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ కాపలాదారులు అతన్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయి ముదక్ పల్లి వెళ్లాడు. బుధవారం ఉదయం కులాస్ పూర్ సొసైటీ సభ్యులు పాల చిన్నయ్య ఇంటికెళ్లి వారి కులస్తులతో రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పి వెళ్లిపోయారు. కులాస్ పూర్ సొసైటీ తనపై ఏదైనా చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో చిన్నయ్య ముదక్ పల్లి అటవి ప్రాంతంలో చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నయ్య కొడుకు సురేష్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మోపాల్ ఎస్సై యాదగిరి తెలిపారు.

More articles

Latest article