. . . వడ్ల లోడ్ లారీ టిప్పర్ డీ
. . . భారీగా ట్రాఫిక్ జాం
డిచ్ పల్లి , బతుకమ్మ:
జాతీయ రహదారి 44 పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పై వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ని టిప్పర్ వేగంగా ఢీ కొట్టిన ఘటన డిచ్ పల్లి ఏడవ బెటాలియన్ ఎదుట జరిగింది. ఈ ప్రమాదంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దానితో కిలో మీటర్ పొడవున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి వడ్ల లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు స్థానికంగా చెరుకుని వాహనాలను దారి మళ్లించారు. డిచ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

