Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 12:35 pm Posted by : ramakrishna

జాతీయ రహదారిపై యాక్సిడెంట్

 

. . . వడ్ల లోడ్ లారీ టిప్పర్ డీ

. . .  భారీగా ట్రాఫిక్ జాం

 డిచ్ పల్లి , బతుకమ్మ:

జాతీయ రహదారి 44 పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పై వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ని టిప్పర్ వేగంగా ఢీ కొట్టిన ఘటన డిచ్ పల్లి ఏడవ బెటాలియన్  ఎదుట జరిగింది. ఈ ప్రమాదంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దానితో కిలో మీటర్ పొడవున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి వడ్ల లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు స్థానికంగా చెరుకుని  వాహనాలను దారి మళ్లించారు. డిచ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Accident on national highway