31.8 C
Hyderabad

జి.జి కాలేజ్ లో లైఫ్ సైన్స్ & ఫిజికల్ సైన్స్ విద్యార్థులకు ఓరియెంటేషన్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో శనివారం లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, విద్యార్థులకు,  ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బి.ఎఫ్.ఎస్.ఐ., హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వంటి కొత్త కోర్సులు మన కళాశాలలో ఉన్నాయని, భవిష్యత్తులో ఇటువంటి నైపుణ్యాభివృద్ధితో ముడిపడిన కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అకాడమిక్ కార్యకలాపాలతో పాటు అప్రెంటిషిప్ కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనాలని, కళాశాల సౌకర్యాలు ఉపయోగించుకొని తమ నైపుణ్యాలు మెరుగు పరచుకోవాలన్నారు. డిగ్రీతో పాటు పీజీ అన్ని సబ్జెక్టులకు కూడా గోల్డ్ మెడల్స్ ఏర్పాటు చేయడమైనదన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం మాట్లాడుతూ విద్యార్థులు  సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయడమే కాదు, స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోవాలని, సమయపాలన, చక్కని ప్రణాళికతో విజేతలు అవుతారని అన్నారు. పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ పరీక్షల నిబంధనలను వివరించారు. ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కళాశాల కార్యక్రమాలను పరిచయం చేశారు. అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, రాహుల్, వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పీఆర్.ఓ. డాక్టర్  దండుస్వామి,రాజేష్ లు విద్యార్థులను ఉల్లాసపరుస్తూ గీతాలను ఆలపించారు. పి.డి. డాక్టర్ బాలమణి, ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం.రామస్వామి, డాక్టర్ పి.రామకృష్ణ, డాక్టర్ జయప్రసాద్, ఉమాకిరణ్, చంద్రశేఖర్, ముత్తెన్న, నరేష్ కుమార్, వేంకటరమణ, పండరి, కిరణ్ కుమార్ గౌడ్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Orientation for Life Science and Physical Science students at G.G. College

More articles

Latest article