29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఈడీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో టోల్ ప్లాజా ఆనుకొని ఉన్న అహ్మద్ బీఈడీ కళాశాలలో ఈ.పి.సి-3 ప్రాజెక్టులో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరిగాయని ప్రిన్సిపాల్ అనీఫ్ పాష తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బడి అంటే చదవడం రాయడం ఆటలాడుకోవడం లాంటి కార్యక్రమాలు కాకుండా నిత్యజీవితంలో ఉపయోగపడే వంటలు ఎలా తయారు చేయాలని దానిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బడికి వచ్చే సమయంలో ఇంటి నుంచి తెచ్చిన వంటలను ప్రదర్శనగా పెట్టిన వంటకాలను ఉపాధ్యాయులు వాటిని రుచి చూసి ప్రశంసలు ఇచ్చారు ఇకపై ఇంట్లో అమ్మకు వంట చేయడంలో సహాయపడడానికి ఇది ఎంతో దోహదపడుతుందని విద్యార్థులు సంబరపడిపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య రామ్మోహన్ శ్రీనివాసులు శైలజ కల్పన అర్చన కిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Food Festival at BED College

More articles

Latest article