24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

జక్రాన్ పల్లి, బతుకమ్మ : నీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు అన్నారు. జక్రాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో విజన్ సంస్థ  సహకారంతో భూగర్భ జల పరిరక్షణపై శనివారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య  అతిథిగా హాజరై ప్రసంగించారు. వివిధ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలు పెంచాలని, నీటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.  విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని,  వర్షం ద్వారా వచ్చే నీటిని వడిసిపెట్టి ఇంకింపజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రాలజిస్ట్ హరి,  వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ సాయిలు,  మండల విద్యాధికారి శ్రీనివాస్,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగన్న, ఉపాధి హామీ ఎపిఓ రవి, ఏ ఈ మోహన్ రెడ్డి, గ్రామపంచాయతీ సెక్రటరీ గంగాధర్, అమ్మ బడి ఆదర్శ కమిటీ లతా,  ఉపాధ్యాయ బృందం,  విజన్ సంస్థ సిబ్బంది శరత్ కుమార్, రాజు, గగన్, హారిక, యాదగిరి పాల్గొన్నారు.

Students should be made aware of the importance of water

More articles

Latest article