27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి క్రైం, బతుకమ్మ : విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అర్ముడ్ రిజర్వు డిఎస్పి యాకూబ్ రెడ్డి  సూచించారు. కొత్తగా వచ్చిన ఆర్ముడ్ రిజర్వు కానిస్టేబుల్ పోలీసులకు ఒక రోజు సీనియర్ అధికారులతో శిక్షణ లో ఆయన వెల్లడించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో నూతనంగా వచ్చిన ఆర్ముడ్ రిజర్వు పోలీసు కానిస్టేబుల్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పోలీస్ శాఖ వచ్చిన కానిస్టేబుల్లు  వివిఐపి  విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి, బందోబస్తు డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీ ఎలా చేయాలి, శాంతి భద్రత విఘాతం కలిగించే,  ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపై జిల్లాలోని అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులతో అవగాహన కల్పించారు. ఈశిక్షణ కార్యక్రమంలో ఆర్ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ, సిఐలు చంద్రశేఖర్ తిరుపతయ్య, నరేష్, రామన్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Work with dedication in the performance of duties

More articles

Latest article