26.2 C
Hyderabad

19మంది మావోయిస్టుల లొంగుబాటు

Must read

📰 Generate e-Paper Clip

భద్రాచలం, బతుకమ్మ : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 19మంది గురవారం భద్రాచలం ఏఎస్పీ ఆఫీస్ కార్యాలయంలో ఎస్పీ ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81 బీఎన్, 141 బీఎన్ సీఆర్పీఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ది, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి, ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని (19) మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారని తెలిపారు. నరోటి మనీష్ ,మడివి నంద, మడివి హండా, మడివి హడమ, మడకం దేవ ,కలుమ ఐత , పోడియం సమ్మయ్య ,పోడియం నగేష్, సోడి హర్జాన్ , పోడియం అడుమ, మడకం ఉంగా , కుంజం మాస , మిర్గం సుక్కయ్య, మడివి ఇడుమయ్య, సల్వం వెంకట్, సల్వం శంకర్, మడివి కోస, దిద్దో సూల, సోడి ఇడుమ లొంగిపోయిన వారిలో ఉన్నారు.

More articles

Latest article