29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చిరుత పులి ఆనవాళ్ళకోసం ఆటవి శాఖ పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

చిరుత పులి పాధముద్రలను సేకరించిన అధికారులు

 ఎడపల్లి, బతుకమ్మ :

ఆలీ సాగర్  ప్రాజెక్టు సమీపంలోని బెరుకు గుట్ట వద్ద ఆటవి శాఖాధికారులు చిరుత పులి ఆనవాళ్ల కోసం పరిశీలించారు.  ఠాణా కలాన్ నుంచి నిజామాబాద్ కు వెలుతున్న బ్యాంకు క్యాషియర్ మసూద్ కు చిరుతపులి కనిపించడంతో బెంబేలెత్తి విద్యుత్ స్తంభం  ఎక్కిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈ నేపథ్యంలో నార్త్ రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్, బీట్ ఆఫీసర్ ప్రవీణ్ లు బుధవారం ఉదయం చిరుత పులి ఆనవాళ్ల కోసం, పాదముద్రలను సేకరించారు. ఆలీసాగర్ అటవి ప్రాంతంలో చిరుతల సంచారం సాధారణమేనని రాత్రి వేళ రోడ్డు దాటే సమయంలో చిరుతల ఇదివరకు చాలా సార్లు కనిపించాయని తెలిపారు. స్థానికంగా అటవి ప్రాంతంలో కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాధిస్తామని ఆటవి శాఖాధికారులు తెలిపారు. వన్య ప్రాణులకు ఎలాంటి హనీ కలిగించవద్దని వారు కోరారు.

Wildlife department checks for  cheetahs

More articles

Latest article