27.2 C
Hyderabad

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం

We will contest the Khairatabad by-election

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, బతుకమ్మ :

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. మరో పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా సీటు ఇచ్చి పోటీ చేయించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమన్నారు. అలాంటి పార్టీకి మద్దతిస్తే రాజ్యాంగం, చట్టాలు ఏమీ వద్దని మనమే చెప్పినట్లవుతుందని ప్రజలకు సూచించారు.

. . . అఫిడవిట్ లో  కన్నా రూపాయి ఎక్కువ ఉన్న తిరిగి ఇచ్చేస్తా

తాను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఉన్న దాని కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నట్టు ఎవరు నిరూపించినా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తన ఫామ్ హౌస్ లీగల్ గా కట్టుకున్నదని అందులో కబ్జా ల్యాండ్ గానీ, ఎఫ్టీఎల్ జోన్ గానీ, అసైన్డ్ ల్యాండ్ గానీ లేదన్నారు. ప్రతి పైసా తాను చట్టానికి లోబడి సంపాదించుకున్నదేనని.. భవిష్యత్ లో కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లకు సంబంధించి వేసిన సిట్ ఉత్తదేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా అనేక రంగాల్లో వేసిన సెట్ లతో ఏం ఒరిగిందని ప్రశ్నించారు. డైవర్షన్ స్కీమ్ లో భాగంగానే ముఖ్యమంత్రి ఇలాంటి సిట్ లు వేస్తారని.. చర్యలు మాత్రం ఉండవని చెప్పారు. ఇంటర్నల్ గా ఒప్పందాలు జరిగే వరకు ఇలాంటి టైమ్ పాస్ సిట్ లు కొనసాగుతూనే ఉంటాయన్నారు.

We will contest the Khairatabad by-election

. . . రేవంత్ రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వం

రేవంత్ రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ చేతకాని ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో ఏటా 4 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఆధునిక కాలంలో ఏటా వేలాది పసికందులు చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ లో పసికందుల మరణాల తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లలో 2020-21 లో 6 వేలు, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది  పసిపిల్లలు చనిపోయాని తెలిపారు. ఏ జిల్లాలో చూసిన సరే ఏటా 2 వందల వరకు పసిపిల్లలు మరణించారని తెలిపారు. హైదరాబాద్ ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న పాలకులు నగరంలో 1,046 మంది చిన్నారులు చనిపోతే కనీసం మానవత్వం చూపించడం లేదు. ప్రభుత్వానికి పరిపాలన చేతకాకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

. . . అధ్వానంగా హాస్పిటళ్లు.. కలెక్టర్లు ఏం చేస్తున్నారు?

రాష్ట్రంలో హాస్పిటల్స్ అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్స్, హాస్టల్స్ విజిట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల బాగోగులు చూసుకోవటం కన్నా కలెక్టర్లకు వేరే పనేముందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లను విజిట్ చేస్తే పరిస్థితులు అవే మారుతాయన్నారు. హెల్త్ మినిస్టర్ కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేన్నరేళ్ల తర్వాత పెద్ద ప్రమాదం జరిగితే తప్ప హెల్త్ మినిస్టర్ ఆదిలాబాద్ రిమ్స్ ను విజిట్ చేయలేదన్నారు. ఆదిలాబాద్ కు వచ్చి జిల్లాలో వైద్య పరిస్థితుల గురించి కాకుండా హెలీక్యాప్టర్ ఫ్యూయల్ అయిపోయిందని ఆయన గొడవ పడి వెళ్లిపోయారే తప్ప ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వలేదన్నారు.

More articles

Latest article