28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తండ్రిని హత్య చేసిన కోడుకు ?

Must read

📰 Generate e-Paper Clip

 ఎడపల్లి, బతుకమ్మ :

తండ్రి, కోడుకులు ఉదయం గోడవపడ్డారు. రాత్రి తండ్రి రక్తపు మడుగులో శవంగా మారాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో జరిగింది. బుదవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది.  ఎడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బత్తులనర్సయ్య  (60) అనే వ్యక్తి అనుమాస్పద స్థితిలో రక్తపు మడుగులో ఇంట్లో మృతి చెంది ఉన్నారని మంగళవారం రాత్రి సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సోమవారం ఉదయం నుంచి  బత్తుల నర్సయ్య తన కొడుకు రాజశేఖర్ తో గొడవ జరుగుతుందని ఈక్రమంలోనే మంగళవారం రాత్రి  సమయంలో కన్న కొడుకే తండ్రిని హతమార్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి రాజశేఖర్ ను అధుపులోకి తీసుని విచారిస్తున్నట్లు  తెలిసింది.

More articles

Latest article