33.4 C
Hyderabad

ఓట్ చోరి  కా నహి . . . రాహుల్ కి ఆకల్ చోరికా

It is not a case of vote theft... but of the theft of Rahul's common sense

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ప్రజాస్వామ్య బద్ధమైన స్వతంత్ర సంస్థ లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి

. . . నిరంకుశం కారణంగా కాంగ్రెస్ లో చిలిపోయింది

. . . భవిష్యత్ లో రేవంత్ పార్టీ విడి వెళ్లిపోవచ్చు

. . .  పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటును నేను నమోదు చేయిస్తా

. . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి

నిజామాబాద్, బతుకమ్మ :

దేశం లో ఎలక్షన్ కమిషన్ లో చీఫ్ కమిషనర్, ఇద్దరు కమిషనర్ ల మధ్య భిన్నభిప్రాయాల పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపూరి కాంగ్రెస్ పార్టీ ని కార్నర్ చేసారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లో మీడియా తో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఓట్ చోరికి నహి అపార్టీ నేత రాహుల్ గాంధీ ఆకల్ కి అన్నారు. దేశం లో ఎలక్షన్ కమిషన్ అన్నది సర్వ స్వతంత్ర సంస్థ అని గుర్తు చేసారు. చీఫ్ కమిషనర్ కు ఇద్దరు కమిషనర్ లకు సర్ పై భిన్నభిప్రాయాలు సాధారణం అన్నారు. ప్రజాస్వామ్యం లో అది సహజం అని కమిషనర్ లు తీసుకునే నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ అమలు చేసే విషయం కాంగ్రెస్ కు తెలియదు అన్నారు. చరిత్ర లో ఒకప్పటి ఎలక్షన్ కమిషనర్ లుగా పని చేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు అని, మాజీ కమీషనర్ ఎంఎస్ గిల్ కేంద్ర మంత్రి  యూపిఏ ప్రభుత్వం లో పని చేయలేదా అని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం దేశం లో నీరసనలకు పిలుపు నీచ్చింది అని, అది దేశ ద్రోహ చర్యలకు వెనుకాడదు అని ఎంపీ అరవింద్ ఆరోపణలు చేసారు. రాహుల్ గాంధీ మొహం చూసి ఎవరు ఓట్లు వేయరు అని వారి పార్టీ లో నిరంకుశ విధానాలు వలన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు పార్టీ ని విడి కొత్త పార్టీ లు పుట్టు కోచ్చాయాని  గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ లో డిక్టేటర్ షిప్ వలన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ విడిపోవచ్చు అని ఎంపీ జోష్యం చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు లేదని నోటీసులు ఇచ్చిన వ్యవహారం పై ఎంపీ ఏద్దేవా చేసారు. ఎలక్షన్ కమిషన్ నియమించిన బిఎల్ఓ లు వచ్చినప్పుడు మహేష్ నిద్ర పోతూ ఉండవచ్చు అన్నారు. రాహుల్ గాంధీ కోరినట్టు రోహింగ్యలకు ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయను కానీ భారతీయులకు మాత్రం ఓటు హక్కు ఇప్పిస్తాను అన్నారు. మహేష్ కుమార్ నిజామాబాద్ వాసి అని అతనికి తానే స్వయంగా ఓటు హక్కు ఇప్పిస్తాను అన్నారు.

It is not a case of vote theft... but of the theft of Rahul's common sense.
 

More articles

Latest article