శాసనభలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన
వెబ్ న్యూస్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని పోచారం రిజర్వాయర్, నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసన సభలో ప్రకటించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీ లో ప్రశ్నించారు. ఇందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు. పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసే అంశం, ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావి అభివృద్ధి అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. పోచారంలో రవాణ , బోటింగ్, పార్కింగ్, ట్రెక్కింగ్, చిన్న పిల్లల కోసం ఆటలు, నాగన్న బావి వద్ద ఫుడ్ కోర్టు, లైటింగ్, సీలింగ్ ఏర్పాటు, తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు.
