24.2 C
Hyderabad

ఎల్లారెడ్డి డీఎస్పీగా సుంకరి శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీగా సుంకరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఎల్లారెడ్డి డీఎస్పీగా విధులు నిర్వర్తించిన శ్రీనివాసులు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. సుంకరి శ్రీనివాస్ గతంలో నిజామాబాద్ ఒకటో టౌన్ ఎస్ హెచ్ వోగా, బోధన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేశారు. సుంకరి శ్రీనివాస్ కు నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డికి పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

More articles

Latest article