- జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : స్త్రీ నిధి రాష్ట్ర బోర్డులో కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పదవికి ఎంపికైనందుకు అభినందించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా రాష్ట్రస్థాయి లో రాణించాలని సూచించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప రాణి, అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, స్త్రీ నిధి ఆర్ఎం కిరణ్ ఉన్నారు. ఈ సందర్భంగా స్రవంతి జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రస్థాయిలో తీసుకునే ప్లాన్లు అన్ని జిల్లాలో అమలుపరుస్తానని మరియు జిల్లాని ముందు స్థాయిలో ఉంచడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కాను 95 కోట్ల ప్లాన్ కి 40 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని మిగిలిన బ్యాలెన్స్ 55 కోట్లు కూడా ఫిబ్రవరి లోపు కంప్లీట్ కంప్లీట్ చేసేటట్టు చూస్తామని, అదే విధంగా రికవరీ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు చూస్తామని తెలిపారు.