జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా రాష్ట్రస్థాయిలో రాణించాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : స్త్రీ నిధి రాష్ట్ర బోర్డులో కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పదవికి ఎంపికైనందుకు అభినందించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా రాష్ట్రస్థాయి లో రాణించాలని సూచించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప రాణి, అడిషనల్...