29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిబంధనలు పాటించని వైనం

 

. . . లోలోపల సెటిల్ మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని స్థానిక బజరంగ్ దళ్ నాయకులు, యువకులు పట్టుకున్నారు. బోధన్ నుండి రుద్రూర్ గ్రామం మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని శనివారం రాత్రి స్థానిక బజరంగ్ దళ్ నాయకులు, యువకులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో పశువులను బోధన్ గోశాలకు తరలించారు. తెలంగాణలో ఎద్దులు లేదా ఇతర పశువుల రవాణాకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారం.. జంతువుల రవాణా నిబంధనలు రవాణా చేసే పశువులు ఆరోగ్యంగా ఉన్నాయా, ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయా ధృవీకరిస్తూ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా అంతర్రాష్ట్ర రవాణాకు ఇది చాలా ముఖ్యం. పశువులకు ఇయర్ ట్యాగ్‌లు వంటి గుర్తింపు ఉండాలి. ఒక ట్రక్కులో (6-వీలర్) గరిష్టంగా 6 పశువులను మాత్రమే రవాణా చేయాలి. ప్రతి పశువుకు కనీసం 2 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. వాహనం ముందు,వెనుక భాగంలో అని స్పష్టంగా కనిపించేలా పసుపు రంగు బ్యాక్‌ గ్రౌండ్‌పై నలుపు అక్షరాలతో బోర్డు ఉండాలి. పశువులు ఒకదానికొకటి తగలకుండా వాహనంలో శాశ్వతమైన గదులు లేదా విభజనలు ఉండాలి. వాహనం నేల భాగం జారిపోకుండా ఉండాలి, ఎక్కించడానికి లేదా దించడానికి తగిన ర్యాంప్‌లు ఉండాలి. ప్రయాణ సమయంలో పశువులకు ఆహారం, నీరు ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో ప్రతి 6 గంటలకు ఒకసారి పశువులకు మేత, నీరు అందించాలి. పశువులను పర్యవేక్షించడానికి వాహనంలో కనీసం ఒక సహాయకుడు ఉండాలి. ముదిరిన, గర్భంతో ఉన్న జంతువులను లేదా 6 వారాల కంటే తక్కువ వయస్సు ఉన్న దూడలను వెటర్నరీ డాక్టర్ సలహా లేకుండా రవాణా చేయకూడదు. అనారోగ్యంతో ఉన్న, గాయపడిన లేదా అలసిపోయిన పశువులను రవాణా చేయడం నిబంధనలను ఉల్లంఘిస్తే జంతు హింస నిరోధక చట్టం ప్రకారం జరిమానా, జైలు శిక్ష లేదా వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి నిబంధనలను పాటించకుండా, అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను రవాణా చేస్తూ, లోలోపల సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

Vehicle transporting cattle illegally seized

More articles

Latest article