ఎల్లారెడ్డి, బతుకమ్మ :
హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిలో వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన దుర్గేందర్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డి పేట్ గ్రామానికి చెందిన చిట్యాల దుర్గేందర్(30)అనే వ్యక్తి హైదరాబాద్ లో రాపిడో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని బంధువుల పెళ్లి ఉండడంతో దుర్గేందర్ తన బావమరిది ప్రసాద్ తో కలిసి హైదరాబాద్ నుండి కామారెడ్డికి వచ్చారు. కామారెడ్డి నుండి నిజాంసాగర్ బస్సు ఎక్కి ఎల్లారెడ్డికి వస్తుండగా లింగంపేట్ కు వచ్చిన తర్వాత బావమరిది ప్రసాద్ అక్కడ దిగిపోయాడని, అదే బస్సులో దుర్గేందర్ ఎల్లారెడ్డికి బయలుదేరి వస్తున్నానని తన కుటుంబ సభ్యులకు, అతని భార్యతో ఫోన్ మాట్లాడాడని తెలిపారు. ఎంతసేపటికి ఎల్లారెడ్డి కి రాకపోవడంతో తన కుటుంబ సభ్యులు తనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో చుట్టు ప్రక్కల గ్రామాలలో తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకి దొరకలేదన్నారు. దీంతో దుర్గేందర్ సోదరుడు చిట్యాల పరంధాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుర్గేంధర్ ఆచూకీ తెలిసిన వారు ఎల్లారెడ్డి పోలీసులకు లేదా సెల్ నెంబర్ 8712666233కు సమాచారం ఇవ్వాలన్నారు.
