29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

జనసేన పార్టీలో చేరిన వివిధ పార్టీ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

సిరిసిల్ల, బతుకమ్మ :

 

వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు తమ జనసేన పార్టీలో చేరినట్టు ఆర్ కే సాగర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యార్థి నాయకులు మహేష్ పెంటల ఆధ్వర్యంలో శనివారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ లోని 15 వార్డుల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు క్యాడర్ తో కలిపి 200 మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్కే సాగర్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్కే సాగర్, రాష్ట్ర యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు చల్లా శివారెడ్డి, పైసా మోజెస్ సిరిసిల్ల నాయకులు హరికృష్ణ, వంగరి సాయికిరణ్, అల్లే శ్రీకాంత్, సందిరి శ్రీకాంత్, నరేష్ రవికాంత్, అడెపు సంతోష్, కట్ల సాయి, నీరజ్, అన్నారం సాయి, మనోజ్, సాయి, ముఖ్యనాయకులు, మహిళలు పాల్గొన్నారు.

 

Various party leaders who joined Jana Sena Party

More articles

Latest article