28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..  కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : నిబంధనలకు విరుధ్దంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మార్గం రాంజీ, అడ్విలింగల్ గ్రామానికి చెందిన ఆదిల్ సోమవారం పోసానిపల్లి గ్రామ శివారులో గల వాగు నుండి అక్రమంగా ఇసుకను తవ్వి ట్రాక్టర్ లలో లక్ష్మాపూర్ గ్రామానికి తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారo మేరకు మార్గమధ్యలో అడ్విలింగల్ గేట్ వద్ద ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు.

Two sand tractors seized, case registered

More articles

Latest article