- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బతుకమ్మ, వేల్పూర్ :- బాల్కొండ నియోజకవర్గం లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం చేస్తూ లబ్ధిదారులైన ఆడబిడ్డలని ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎందరో పేదిoటి ఆడబిడ్డ పెళ్లిళ్లకు ఒక మేనమామ కట్నంగా కెసిఆర్ లక్ష రూపాయలు అందజేశారు అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈనెల తీసుకుంటే లక్ష వచ్చే నెలకి అయితే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నమ్మి ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారం ఇస్తే ఇప్పుడు 16 నెలలు అయింది తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2023 నుండి ఇప్పటి వరకు చెక్కులు అందుకున్న ప్రతి ఒక్క ఆడపిల్లకు తులం బంగారం ఇవ్వాలని బి ఆర్ ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో బాల్కొండ నియోజకవర్గం లో విడుదల వారీగా సుమారు 847 చెక్కులు వచ్చాయని ఆ చెక్కులు మంజూరైన వారందరూ ప్రజెంట్ ఆడబిడ్డలకు ఆ డబ్బు తొందరగా అందితే వారికి ఉపయోగపడుతుందని అన్నారు. చెక్కులు పంపిణీ జాప్యం జరగద్దని ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆ చెక్కులను గ్రామాలకు పంపించి గ్రామపంచాయతీ సెక్రెటరీ అధికారులకు ఆలస్యం చేయకుండా వెంటనే పంపించాలని ఆర్డీవో కి నెలరోజుల క్రితమే అధికారంగా లేఖ రాశారని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు వారి అహంకారం అధికార ధర్పం కోసం స్వార్ధబుద్ధితో వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఆపినారని అన్నారు. చెక్కులు పంపిణీ చేసే పూర్తి అధికారం నాకే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పటికి ఆలస్యం అయినందుకు వారికి నేరుగా చెక్కులు అందించడానికి గ్రామపంచాయతీ సెక్రటరీ ద్వారా వెంటనే పంపించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
