27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దారిలోనే ధాన్యం బస్తాల మాయం

Must read

📰 Generate e-Paper Clip

  • రైతుల ధాన్యం మిల్లులకు చేరక ముందే తస్కరణ
  • నందిపేట మండల కేంద్రంలో ఘటన
  • రైతులు తీసిన వీడియో వైరల్

 

నిజామాబాద్, బతుకమ్మ:

ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతులు అడుగడుగున దోపిడీకి గురవుతున్నారు. నకిలీ విత్తనాలు మొదలుకొని పంట కోసి సంబంధిత ధాన్యం అమ్మకానికి వెళ్లే వరకు దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి… అధికారులు మారుతున్నారు… కాని దోపిడీకి మాత్రం చెక్ పడటం లేదు. ధాన్యాన్నిదళారుల పాలుకాకూడదని ప్రభుత్వం బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుందని సొసైటీలకు, మహిళా సమాఖ్యలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు తాళు పేరిట.. తరుగు పేరిట దోచుకోనే కల్చర్ ఉమ్మడి జిల్లాలో ఉంది. పంట కోసం కోనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే  అక్కడ తూకాలతో మోసం జరుగుతునే ఉంది. తాజాగా రైతుల ధాన్యం తూకాలు వేసి మిల్లులకు తరలిస్తుండగానే దారి మళ్లించి తూకాలలో (ధర్మకాంటా) చేరక ముందే దోపిడీకి పాల్పడుతున్నారు.

Grain sacks disappear on the way

ఈ సంఘటన ఆదివారం నందిపేట్ మండల కేంద్రంలో కొత్త బైపాస్ రోడ్డులో ఒక లారీ నుంచి ధాన్యం బస్తాలను టాటా ఎస్ మ్యాజీక్ లో అక్రమంగా డంప్ చేస్తున్న విషయాన్ని కొందరు రైతులు గుర్తించారు. ఈ విషయాన్ని లారీ డ్రైవర్ ను ప్రశ్నిస్తే రైతుకే బెదిరింపులు ఎదురయ్యాయి. దానితో ఖంగుతిన్న రైతు సంబంధించిన విషయాన్ని తన ఫోన్ లో వీడియో తీయడంతో ఈ దోపిడీ బట్ట బయలైంది. అధికారులు, మిల్లర్లు, చివరకు లారీల యజమానులు రైతులను దోచేస్తున్నారు అనడానికి కల్లాల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని కాంటా చేయకముందే తస్కరిస్తున్నారు. చివరకు రైతులకు తూకాల వద్ద ఉన్న లెక్కల ప్రకారం  బరువు తక్కువ వచ్చిందని మోసం చేస్తున్నారు. ప్రతి ఏడాది ధాన్యం సేకరణ, కొనుగోలు వ్యవహరంలో తూకాలలో తేడాలు ఉండాటానికి మధ్యలో

Grain sacks disappear on the way

ధాన్యం బస్తాల దారి మళ్లింపు కారణం అనే  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు విషయంలో దళారులు, మిల్లర్లకు ఇప్పుడు లారీల డ్రైవర్లు కుమ్మక్కయ్యారని నందిపేట రైతులు ఆరోపిస్తున్నారు. ఏకంగా బస్తాలకు బస్తాలను, లారీలలో నింపినవి నింపినట్లు లెక్కలు రాసీ మార్గమద్యంలోనే దోచుకునే దొంగతనాన్ని అధికారులు బట్ట బయలు చేయాని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సీజన్ లోరైతులను దోచుకుంటున్న వారే ఎక్కువ అవుతుండగా ధాన్యం పండించే రైతులు మాత్రం తగ్గిపోతున్నారు. రైతులకు చెల్లింపుల సమయంలో ధాన్యంలో కొరత ఉందని బహిరంగంగా కోతలు విధించి డబ్బులు కట్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Grain sacks disappear on the way

More articles

Latest article