30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎస్ ను కలిసిన టీఎన్జీవోస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ  చీఫ్ సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూతన సీఎస్ రామకృష్ణారావు ను హైదరాబాద్ లోని సచివాలయం లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఇతరత్రా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎంప్లాయిస్ జేఎసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article