27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రుద్రూర్ పీఎస్ కానిస్టేబుల్ సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

  • ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినందుకు పోలీసు కేసు
  • పది శాతం వడ్డీ వసూల్ చేసినందుకు క్రమశిక్షణ చర్యలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న సిద్దిరాం చిన్నయ్య (2135) కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో మరో కానిస్టేబుల్ పై వేటు పడడం కలకలం రేపింది. గురువారం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ గజానంద్ ను సస్పెండ్ చేసినా సీపీ మరోసారి కొరడా ఝళిపించారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తెంబుర్తి గ్రామానికి చెందిన రావుల నాగభూషణం అనే వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని కానిస్టేబుల్ చిన్నయ్య రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికి ఎలాంటి ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదే విధంగా నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఇతరులకు అప్పులు ఇచ్చి పది శాతం కన్నా ఎక్కువ వడ్డిని వసూల్ చేసినట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపించి చిన్నయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు.

More articles

Latest article