నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూతన సీఎస్ రామకృష్ణారావు ను హైదరాబాద్ లోని సచివాలయం లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఇతరత్రా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎంప్లాయిస్ జేఎసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి పాల్గొన్నారు.