- పట్టించుకోని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : మండలం అక్బర్ నగర్ గ్రామంలోని గుట్ట ప్రాంతమైన 3వ వార్డులో గత పది రోజులుగా వీధిలైట్లు వెలగక గుట్ట నుంచి విషపూరితమైన తేళ్లు పాములు వంటివి ఇళ్లలోకి వచ్చిన సందర్భాలు బాగానే ఉన్నాయన్నారు. స్థానిక అధికారులకు పలు మార్లు విన్నవించిన ఇదిగో చేస్తాం, అదిగో చేస్తామని కాలం వెల్లడియ్యడం తప్ప స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఇటు వీడిసి పెద్దల సైతం గ్రామంలో నెలకొన్న పరిస్థితుల పై ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఉండడం పట్ల అక్బర్ నగర్ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గైతే ఎలా?.. అని మాకేమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అంటూ మూడో వార్డు గ్రామస్తులు లక్ష్మణ్, సాయిలు, బోయి బందయ్యా, గంగామణి, శేఖర్, లింగం, శ్రీనివాస్ లు ప్రశ్నిస్తున్నారు. ఇట్టి సమస్యను త్వరగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

