25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

లబ్ధిదారులు, కమిటీ సభ్యులతో చర్చలు ప్రారంభించాలి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : లబ్ధిదారులతో, కమిటీ సభ్యులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని బోధన్ సబ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. బోధన్ సబ్ కలెక్టర్ అధ్వర్యంలో ఇండిరమ్మ ఇళ్ళు రెండవ దశ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేటాయించిన స్థలాల్లో మార్కింగ్ పనులు వెంటనే మొదలుపెట్టాలన సూచించారు. లబ్ధిదారులను ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ప్రోత్సహించాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఇండిరమ్మ ఇళ్ల పథకం రెండవ దశను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్, డివిజినల్ ఇంజనీర్, మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్లు, వార్డు అధికారులు, హౌసింగ్ అధికారులు హాజరయ్యారు.

Discussions should be initiated with beneficiaries and committee members.

More articles

Latest article