27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కారులో వచ్చి దర్జాగా చోరీ చేసిన దుండగులు

Must read

📰 Generate e-Paper Clip

. . . సీసీ కెమెరాల్లో రికార్డైన చోరీ దృశ్యాలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలోని 35వ వార్డు శివాలయం వీధిలో దొంగలు రెచ్చిపోయారు. కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, దుండగులు అర్ధరాత్రి సమయంలో కారులో వచ్చి ఇంటి గేటు దూకి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

More articles

Latest article