28.2 C
Hyderabad

వర్షాలు బాగానే పడుతాయి

Must read

📰 Generate e-Paper Clip

భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం

సికింద్రాబాద్, బతుకమ్మ :  సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం సోమవారం జరిగింది. బోనాల జాతరలో రెండోరోజు జరిగే ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈసందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఏడాది వర్షాలు బాగానే పడతాయని, అగ్నిప్రమాదాలు జరుగుతాయని, రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందని, ప్రజలు జాగ్రత్త ఉండాలని  భవిష్యవాణిలో చెప్పారు.  అమ్మవారు నాలుగు కాళ్ల పెద్ద జీవం కోరింది. కొద్దిగైనా అమ్మవారికి రక్తం చూపించాలంది. లేదంటే ఉగ్రరూపం చూపిస్తానని.. అప్పుడు అందరూ రక్తం కక్కుకొని చస్తారని హెచ్చరించింది. ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానన్నారు.  ప్రతి ఏడాది మాదిరిగా ఏదో ఒక ఆటంకం కలుగజేస్తున్నారని,  ఏటా నా కోరిక చెపుతున్నా లెక్కచేయడం లేదని చెప్పారు. తల్లి దండ్రులు పిల్లలను విచ్చల విడిగా వదిలేస్తున్నారన్నారు.  అయినా నా బిడ్డలను నేను కాపాడుకుంటున్నాని అన్నారు. ఎవరి ఏది అనుభవించాలో వారు…  తప్పక అనుభవిస్తారని  చెప్పారు.  అమ్మవారికి విధివిధంగా పూజలు జరిపించాలని ఆదేశించారు. నా భక్తులను వెంట ఉండి కాపాడుతాన  న్నారు. తెలంగాణతో పాటు భారతదేశాన్ని కాపాడే బాధ్యత నాదేన్ననని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. నన్ను కొలిచేవారికి ఎలాంటి ఇబ్బంది కలుగజేయనని తెలిపారు.  అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటానని తెలిపారు.ఈ ఏడాది ఐదువారాల పాటు పప్పు బెల్లాలతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు ఆజ్జాపించారు.

More articles

Latest article