27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇచ్చిన హామీని అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సిపిఎం నగర కార్యదర్శి సుజాత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎన్నికల్లో గెలిచిన వెంటనే డింపింగ్  యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. నాగారం 300 క్వార్టస్ వద్ద ఆదివారం రాత్రి డంపింగ్ యార్డ్  నిప్పులు చెలరేగడంతో  ప్రజలు పొగ వాసన పడక అతలాకుతలమయ్యారని తెలిపారు. దాంతో అక్కడ ఉన్న కమిటీ సభ్యులు ప్రజలు ఉద యాన్నే  చెత్త బండ్లను నిలిపివేసి నిరసన తెలిపారని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేయడంతో కమిషనర్ కదిలి వచ్చారని అన్నారు. డంపింగ్ యార్డ్ వాసనతో చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు.   ఇప్పటికే చాలాసార్లు గతంలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మెమొరాండం అందజేశామని తెలిపారు. ఇప్పటివరకు ఏ నాయకులూ కూడా ఆ సమస్యని పరిష్కరించలేదని అన్నారు. అక్కడ ప్రజల ఇబ్బందులు  పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు వచ్చిన అధికారిలు అన్న కనీసం సమస్య పరిష్కారం అయ్యేలా ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా చూడాలి అని అన్నారు.  లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ కమిటీ సభ్యులు జి.గంగాధర్, జి బాలకృష్ణ,  జై శ్రీధర్, జి.సంతోష్,  రాజమణి, ఎం.సుగుణ, గంగమని, పద్మ,  యమునా, లలిత  తదితరులు పాల్గొన్నారు.

The promise given must be fulfilled.

More articles

Latest article