నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడో టౌన్ పరిధిలో నిషేధిత గంజాయి అమ్ముతున్న ఒకరిని సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసలు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని దుబ్బ, గుర్బబాది రోడ్, కృష్ణ మందిర్ దగ్గర నిషేధిత గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మూడో టౌన్ పోలీసులు దాడి చేసి బిహార్ రాష్ట్రంలోని బదాస్ నార్త్ ప్రారంతానికి చెందిన పునీత్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 55గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు బిహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయించే వాడని తెలిపారు.