రుద్రూర్, బతుకమ్మ :
జిల్లా వంజరి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ నెల 13న నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు బోనేకర్ భూమయ్య తెలిపారు. ఈ మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం వంజరి శివకుమార్ నివాసంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పత్రికను అందజేశారు. ఏప్రిల్ 19న జరిగిన జిల్లా వంజరి సంఘం కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఎన్ను కున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా ధాత్రిక వేణుగోపాల్, కోశాధికారికా కరిపే మధుసూదన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఈనెల 13న బుధవారం జిల్లా వంజరి సంఘం కళ్యాణ మండపంలో నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి వినయ్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారన్నారు.
