26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి పిలుపు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పిలుపునిచ్చారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో రుద్రూర్, పొతంగల్, వర్ని, కోటగిరి, మోస్రా, చింతకుంట మండల నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. 25 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గా ఉంటూ భారతదేశంలో అందరూ తన కుటుంబంలాగా, పిల్లలుగా భావిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. బిజెపి తదుపరి లక్ష్యం తెలంగాణేనని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.

 

Prime Minister Narendra Modi's public meeting should be a success

 

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, బాన్సువాడ నియోజక వర్గం నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, ఎల్తామ్ శంకర్, మండల అధ్యక్షులు, (బజరంగ్) హనుమాన్లు, ఏమూల నవీన్, పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఆవుల రమేష్, మోస్రా సర్పంచ్ భూపాల్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బీవీ గుప్తా, చిదురా మహిపాల్, కటిక రామరాజు, ఏముల గజేందర్, బోజిగొండ అనిల్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్, శ్రీనివాస్, తోట శంకర్, పార్వతి మురళి, శివప్రసాద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article