30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

క్లాస్‌రూమ్‌లో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఖమ్మం జిల్లా మధిరలో విషాదం

 

. . . పాఠం చెబుతూ కుప్పకూలిన ఇంగ్లీష్ టీచర్

 

ఖమ్మం, బతుకమ్మ :

 

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు గారపాటి జయరాజు శనివారం క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి మృతి చెందారు. ఖమ్మంలోని మమతా రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఒలింపియాడ్ క్యాంపస్ స్కూల్‌లో నిర్వహిస్తున్న వర్క్‌ షాప్‌లో జయరాజు డెమో క్లాస్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠం చెబుతూ ఉండగానే ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.

 

Teacher dies of heart attack in classroom

 

ఈ ఘటనతో స్కూల్‌లో విషాద వాతావరణం నెలకొంది. జయరాజు కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ దృశ్యాలను చూసిన తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మధిర పట్టణంలోని రెండో వార్డ్ ఎంప్లాయిస్ కాలనీలో నివాసం ఉంటున్న జయరాజు మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

More articles

Latest article